కొత్త శతాబ్దం లోకి అడుగు పెడుతున్నందుకు అందరూ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారు. అందరి మనస్సుతో తెలియని ఉత్తేజం బహుస ఆ ఉత్తేజం కొత్త ఆశల వలనేమో! అందరి ముఖంపై నిశబ్ధపు చిరునవ్వు అందరి మెదడులో రక రకాల ప్రశ్నలు, ఆనందాలు, భయాలు, సంతోషాలు గొప్ప వేగంతో పరిగెత్తుతున్నాయి.
కొత్త శతాబ్దం లోకి అడుగు పెడుతుండగా జరిగిన గతాన్ని స్మరించడం అనివార్యం. ఒక్క సారి కాల గర్భంలోకి తిరిగి చూస్తే మనకు కనబడేది యుద్ధాలనాశనాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రేమ బలం, శాంతి ఉదయించడం. వీటన్నిటితో పాటు ప్రయోగ శాస్త్రము లో అభివృద్ధి ప్రముఖం.
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి జరగడమే కాదు ఆ అభివృద్ధి చెందిన సాంకేతికత అందరి సొంతమైంది. అలా సొంతం కావాడనికి ఎందరో తమ ఆయువును బలిచ్చారు, ఎన్నో పోరాటాలు, ఎన్నో మార్లు ప్రభుత్వాలు కులిపోయాయి కానీ చివరికి మంచిదే విజయం.
భూమాత మానవుడు పుట్టినప్పటి నుంచి వాడిని ఎంతో ప్రేమతో పెంచి, పోషించి పాలించింది. మానవుడి ఆయుషు నిండాక కూడా ఆ తల్లి ప్రేమ ఏ మాత్రం తగ్గ లేదు, తన మట్టి అనే పొడవైన చేతులతో గెట్టిగా కౌగిలించి, జోల పాడి శాస్వత నిద్రలోకి పంపింది.ఇప్పుడు ఆధునిక మనిషి తన తల్లి ఊయల నుండి తండ్రి అంతరిక్షం ఒడిలోకి సైన్స్ అండ్ టెక్నాలజీ రెక్కలతో దూకాడు. అనంతమైన అంతరిక్షం మనిషికి సాదర స్వాగతం పలికింది.
మానవుడు తను ఎంతో కాలంగా ఎదురుచూసిన స్పేస్ సెటిల్మెంట్ (అంతరిక్షంలో నివసించడం) ని సాదించాడు. ఇప్పుడు భూమి మానవుడి పుట్టిళ్ళుగా మరియు అంతరిక్షం తన మెటిళ్ళుగా మారింది.ఈ అభివృద్ధి మంచి కోసమే కానీ, ఒక్క చిన్న పొరపాటు మానవజాతిని చరిత్ర నుండి పూర్తిగా తుడిచివేస్తుంది.
Write a comment ...